కొత్తగూడెం జిల్లాలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ మానసిక సమస్యలు, కలహాలతో విరక్తి చెందిన నాగేశ్వరావు అనే వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.