TG: రాష్ట్ర బడ్జెట్ డొల్ల కాబట్టే బడ్జెట్ పత్రాలు చింపామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బడ్జెట్లో 6 గ్యారంటీల హామీ లేనందున పత్రాలు చింపామన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, కోటి మంది మహిళలకు నెలనెలా రూ.2,500 ఇస్తామని ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ మోసాన్ని తెలిపేందుకు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపామని వెల్లడించారు.