TG: పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రామగుండం మండలం లింగాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. స్టీరింగ్ పట్టేయడంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్‌కు గాయాలయ్యాయి. విద్యార్థులను మోడల్ స్కూల్లో దింపి వస్తుండగా ఘటన చోటుచేసుకోగా, బస్సులో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.