TG: ఏపీ సర్కారు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గత ప్రభుత్వం శ్రీశైలంలో నీటి దోపిడీ పట్టించుకోలేదని, వారి తప్పిదాలను ఏపీ అలుసుగా తీసుకుందన్నారు. తమ పంటలు ఎండుతుంటే.. మీరు నీళ్లు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. విద్యుదుత్పత్తి పేరుతో నీళ్లు తరలించుకుపోతున్నారని, పాలమూరు హక్కులు కాపాడుకోవడమే తమ లక్ష్యమన్నారు.