TG: సీఐడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ‘ఏ తప్పు చేయకపోయినా.. ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు, నా కుటుంబానికి, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో ఇలా నోటీసులు ఇచ్చి బెదిరింపులకు గురిచేయడం సరికాదు’ అని ట్వీట్లో కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.