మహేష్ బాబు, రాజమౌళి ‘వారణాసి’ సినిమా క్రెడిట్‌పై నెట్టింట జరుగుతున్న చర్చకు నిర్మాత శోభు యార్లగడ్డ చెక్ పెట్టాడు. ‘వారణాసి’ పేరు ప్రస్తావించకుండానే.. ‘ఏ సినిమాకైనా ప్రాథమిక గుర్తింపు దర్శకుడిదే. సినిమా అనేది ఒక కళాత్మక రూపం. దాని సృజనాత్మకత, థీమ్, మేకింగ్ స్టైల్ అన్నీ దర్శకుడి ఆలోచనలే. అందుకే డైరెక్టెడ్ బై అని ఆయన పేరుకే ప్రాధాన్యత ఉంటుంది’ అని ఆయన తెలిపాడు.