BDK: పాల్వంచ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కిన్నెరసాని డీర్ పార్కును ఇవాళ, రేపు మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇవాళ ప్రకటించారు. పార్కు గేటు నుంచి డక్ పాండ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి అటవీశాఖకు సహకరించాలని కోరారు.