ASF: నిర్మాణాల కోసం ఇసుకను తరలించేవారు ఇకపై పాత పద్ధతిలో కాకుండా, ఆన్లైన్ ద్వారానే అనుమతులు పొందాలని దహెగాం మండల తహశీల్దార్ మునవర్ షరీఫ్ మంగళవారం స్పష్టం చేశారు. ఇళ్లు, ఇతర కట్టడాలకు నిర్ణీత చలానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.