ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ పై IPL బెట్టింగ్ మాఫియా చాప కింద నీరులా పాకుతుంది. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి ప్రాంతాల్లో బెట్టింగ్ యాప్ ద్వారా జోరుగా పందేలు కడుతున్నారు. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వేదికగా నమ్మించి మోసం చేస్తోంది. బైక్, సెల్ ఫోన్, బంగారం తాకట్టు పెట్టి మరి బెట్టింగ్లు కడుతున్నారు.