MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సుల రెండో, నాల్గవ, ఆరో సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు చెల్లింపు నేటితో (మార్చి 31) ముగియనుంది. ఈ నోటిఫికేషన్ మార్చి 28 వరకు ఉన్న గడువును అధికారులు రీ – నోటిఫికేషన్ ద్వారా నేటి వరకు పొడిగించారు. గడువు ముగిస్తే అపరాధ రుసుముతో లేదా అసలు అవకాశం కోల్పోయే ప్రమాదం కలదని హెచ్చరించారు.