శ్రీకాకుళం, సోంపేట మండలాల్లో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. శ్రీకాకుళం నగరంలో అభ్యుదయ డిగ్రీ కాలేజీలో సుమారు 15 కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అలాగే సోంపేట మండలంలో కొంచాడ రాజేశ్వరరావు డిగ్రీ కళాశాలలో 12 కంపెనీలు హాజరై 300లకి పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు.