కోనసీమ: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశం కోసం కొత్తపేట మండలంలో మొదటి దఫా 44 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు కొత్తపేట MEO ఎం. హరిప్రసాద్ తెలిపారు. మొదటి దఫా ఎంపికైన విద్యార్థుల వివరాలను, ఆయా ప్రైవేటు పాఠశాలలకు పంపడం జరిగిందన్నారు. మండల విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశామన్నారు.