తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండోరోజైన మంగళవారం శ్రీమలయప్పస్వామి స్వర్ణ రథాన్ని అధిష్ఠించారు. శ్రీదేవి, భూదేవితో కలిసి తిరు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. భక్తులు గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.