TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, రోజువారీ ఖర్చుల కోసం కూడా ప్రభుత్వం ఆర్బీఐ ముందు చేయి చాచాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సుమారు రూ.1.30 లక్షల కోట్లు తెచ్చి సర్కారును నెట్టుకొచ్చారు. 2025 మార్చి 31 నాటికి సుమారు రూ.6 వేల కోట్లు తిరిగి చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది’ అని ఆమె ఆరోపించారు.