ASR: కొయ్యూరు మండలంలోని దొడ్డవరం గ్రామంలో ఓ గిరిజనేతరుడు చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేస్తామని గిరిజన మహిళలు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆదివాసీ జేఏసీ నాయకులు మొట్టడం రాజుబాబు, నర్సి పాపారావు, బూరుగ వెంకటరావు తదితరులతో ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావును కలిశారు. గ్రామంలో కమ్యూనిటీ హాలుకు అడ్డంగా ఓ గిరిజనేతరుడు ఇల్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు.