MBNR: జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో న్యాయస్థానం (జడ్జి తమన్ రాజరాజేశ్వరి) తుదితీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు జరిమానా విధించగా, ఇతర ఇద్దరు నిందితులకు కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేయించింది. దీంతో జిల్లా ఎస్పీ డి.జానకి శిక్ష పడేలా కృషి చేసిన అధికారును అభినందించారు.