KRNL: గోనెగండ్ల మేజర్ పంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ఇంటి, కుళాయి, వాణిజ్య పన్నులను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కార్యదర్శి సతీష్ కోరారు. పన్నుల వసూళ్లపై సిబ్బందితో కలిసి సోమవారం ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు. స్వర్ణ పంచాయతీ ద్వారా ఆన్లైన్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.