VKB: హనుమాన్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ స్నేహమేహ్రా పేర్కొన్నారు. వికారాబాద్లో హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్న ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలీస్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో శోభాయాత్రను నిర్వహించుకోవాలన్నారు.