అన్నమయ్య: ఒంటిమిట్ట పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబును టీఎన్ఎస్ఎఫ్ రాజంపేట నాయకుడు పోలి శివకుమార్ కలిశారు. తాళ్లపాక చెరువును అన్నమాచార్య యూనివర్సిటీ ఆక్రమించిదని సీఎంకు వివరించారు. ఆ యూనివర్సిటీ రూ.46.81 లక్షల పన్ను బకాయి ఉందని తెలిపారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారుల తీరుపైనా ఆయన ఫిర్యాదు చేశారని సమాచారం.