BDK: దమ్మపేటలోని పలు గ్రామసభలలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడం గ్రామసభల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.