కడప జిల్లా పరిషత్ సీఈవో ఓబులమ్మ అనంతపురం జిల్లా పర్యాటక శాఖకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో పత్తికొండ డీడీవో రామచంద్రారెడ్డిని పదోన్నతిపై నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (జీఓ నెంబరు. 228) ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పరిషత్ సీఈవోతో పాటు రాష్ట్రంలో మొత్తం పది జిల్లాలకు కొత్త సీఈవోలను ప్రభుత్వం నియమించింది.