GDWL: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు రాఘవేంద్రరావు, రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం విద్యుత్ శాఖ గద్వాల డివిజన్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. చదువు అర్హతతో ఉద్యోగాలు కేటాయించాలని, స్పాట్ బిల్లర్స్కు జీవో నంబర్ 11 ప్రకారం వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు.