NGKL: చారకొండ మండలం శిరుసనగండ్ల సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాపుల నిర్వాహకులు విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా, అబ్కారీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు విమర్శిస్తున్నారు. జాతర పవిత్రతను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.