NGKL: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం కుట్రలు చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. చారకొండలో రైతు వేదికలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని తెలిపారు,