TPT: సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31 లోపు పాత బకాయిలతో పాటు ప్రస్తుత పన్నులు చెల్లించిన వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఆదివారం కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి మున్సిపల్ సిబ్బంది, స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది సేవలు అందించనున్నారు.