GDWL: నదీ తీర ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగుతుంది అని అయిజ ఎస్సై శ్రీనివాసరావు హెచ్చరించారు. శనివారం పులికల్ శివారులోని తుంగభద్ర నది నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి, ఇసుకతో సహా వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు.