అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని బోయినపల్లి ప్రాంతంలో కృష్ణవేణి అనే మహిళ గురువారం ఉరివేసుకుని మృతిచెందింది. ఆమె భర్త శ్రీరామ్ శ్రీనివాసులు రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు. దంపతుల మధ్య కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.