KDP: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు కాలనీలు, గ్రామాలు, పాఠశాలల్లో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, సైబర్ నేరాలు హెల్ప్‌లైన్ నంబర్లపై మహిళలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.