MNCL: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ – కాల్ టెక్స్ మధ్య రైల్వే మార్గంలో సుమారు 30 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైనట్లు GRP హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. మృతుడు నలుపు రంగు టీ-షర్ట్, నీలి రంగు నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామని, సమాచారం తెలిసిన వారు సంప్రదించాలన్నారు.
ATP: గుంతకల్లు పట్టణంలో ఆదివారం వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు బోయ సుంకప్ప ఆధ్వర్యంలో వాల్మీకుల ఎస్టీ సాధన పునరుద్ధరణ కోసం 36 గంటల పాటు దీక్ష కార్యక్రమం చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు బోయ సుంకప్ప మాట్లాడుతూ.. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించి, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
మహిళలను ఎలా గౌరవించాలో పదేపదే గుర్తుచేస్తూ ఉండటం తనకు నచ్చదని హీరో జూ.ఎన్టీఆర్ అన్నాడు. పుట్టుకతోనే ప్రతి పురుషుడు మహిళల పట్ల గౌరవంతో పుట్టాల్సిన సమయం ఇదని అభిప్రాయపడ్డాడు. మనం మన పిల్లలకు మన ఇళ్ల నుంచే సరైన విద్యను అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. తన ఇద్దరు కుమారులు మహిళలను గౌరవిస్తూ పెరిగేలా తాను ఖచ్చితంగా చూసుకుంటానని వెల్లడించాడు.
BDK: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యర్యంలో DCC అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదివారం మహిళలతో కలిసి ఘనంగా జరిపారు. మహిళలను మహారాణులను చేయానే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌కు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమన్నారు.
NDL: రేపు జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, పలువురు అధికారులతో కలిసి ఇవాళ కార్యక్రమ స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. మున్సిపల్ సిబ్బందికి క్లీనింగ్ కిట్లు పంపిణీ చేసి, కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు.
KRNL: ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్న దీక్షలు ఆదివారం 113వ రోజుకు చేరుకున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా పలు గ్రామాల మహిళలు దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఆదోనిని కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంట రహదారిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రానికి చెందిన హుస్సేన్ కుమారుడు సంసోను బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. పెద్దకడబూరు నుంచి కల్లుకుంట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే అతడిని చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: హెబ్బటం గ్రామంలో భక్తి ఉద్యమకారుడు, సామాజిక సంస్కర్త శ్రీ కనకదాసు విగ్రహావిష్కరణ మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆలూరు TDP ఇంఛార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కనకదాసు భక్తి, సమానత్వం, సామాజిక సందేశాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
NZB: బోధన్ మండలం పెగడపల్లిలో ఆదివారం ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సేవలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ సమాజ శ్రేయస్సుకు ఆయన చూపిన మార్గం ఆదర్శనీయం అని కొనియాడరు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్ రెడ్డి, ఛైర్మన్ కేశవేణు, మున్సిపల్ ఛైర్మన్ పద్మాశరత్ రెడ్డి పాల్గొన్నారు.
T20 WC ఫైనల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగడం న్యూజిలాండ్ జట్టుకు కలిసొచ్చే అంశం. గతంలో అహ్మదాబాద్‌లోనే భారత్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయింది. భారత్‌ను ఓడించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు న్యూజిలాండ్ వద్ద ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని పేర్కొన్నాడు.
KMM: నేలకొండపల్లి గ్రామంలోని కర్నాటి క్రిష్ణయ్య నగర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మహిళా సమాఖ్య నాయకులు భాగం సరోజిని, మారిశెట్టి విజయదుర్గ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి అభివృద్ధి సాధించాలని అన్నారు. మహిళలు అందరూ కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అని పేర్కొన్నారు.
AKP: పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని అచ్యుతాపురం మండల సీపీఎం కన్వీనర్ ఆర్.రాము డిమాండ్ చేశారు. ఇవాళ అచ్యుతపురంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలపై కేంద్రం మోయలేని భారం మోపిందన్నారు. సిలిండర్‌కు రూ.60 పెంచడంతో ప్రజలకు ఆర్థికంగా భారం అవుతుందని, ఇరాన్‌పై యుద్ధం వద్దని అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
NLG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నార్కెట్‌పల్లి, చిట్యాల పోలీస్ స్టేషన్ల మహిళా సిబ్బందిని ఆదివారం నార్కట్ పల్లి పీఎస్‌లో ఘనంగా సన్మానించారు. మహిళా పోలీసులు విధుల్లో ప్రదర్శిస్తున్న కర్తవ్యనిష్ఠను, అందిస్తున్న సేవలను డీఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు విష్ణుమూర్తి, రవికుమార్ పాల్గొన్నారు.