• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

CTR: గంగవరం మండలంలోని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. వ్యవస్థాపకులు తులసీనాథం నాయుడు దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. 20 మంది పారిశుద్ధ్య కార్మికులను ఈ సందర్భంగా సన్మానించారు. వారికి దుస్తులను పంపిణీ చేశారు. సృష్టిలో మహిళ గొప్పదనాకి మరేది సాటి లేదని వారు తెలియజేశారు.

March 8, 2026 / 03:21 PM IST

ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన భారత్

భారత బాక్సింగ్ జట్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మోంటెనెగ్రోలోని బుడ్వా నగరంలో ఈ నెల 3-11 వరకు జరగాల్సిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జూనియర్ జట్టు పాల్గొనాల్సి ఉంది. వీసా స్టాంపింగ్ కోసం UAEకి పంపిన పాస్‌పోర్టులు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణం నిలిచిపోయాయి. దీంతో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా టోర్ని నుంచి తప్పుకుంది.

March 8, 2026 / 03:21 PM IST

మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

PDPL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్ 7వ వార్డులో నిర్వహించిన వేడుకలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుల్తానాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును సందర్శించారు.

March 8, 2026 / 03:19 PM IST

కేంద్ర, రాష్ట్ర కొలువులు సాధించిన కవలలు

KDP: ఆ ఇంట్లో వారిద్దరూ కవల పిల్లలు. పులివెందుల పట్టణానికి చెందిన గురు దత్త-అనిలా దేవి దంపతుల కుమార్తెలు సాయి వర్ణిత, సాయి వర్షితలు. వీరిద్దరూ కష్టపడి చదివి న్యాయ పట్టా పొందారు. సాయి వర్ణిత ఏపీఎండీసీ న్యాయ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ దక్కించుకోగా.. సాయి వర్షిత 5 కేంద్ర ప్రభుత్వ కొలువులు సాధించింది.

March 8, 2026 / 03:17 PM IST

డబ్బు కాదు.. ఆలోచనా విధానమే ముఖ్యం: CM

AP: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ముందుగా అభివృద్ధి జరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో సుపరిపాలన ఉండాలి. మనకు డబ్బు సమస్య కాదు.. ఆలోచనా విధానమే ముఖ్యం. మీ పరిధిలో ఉన్న విషయాల్లో తప్పు చేయకుండా ముందుకెళ్లాలి. ఇంటా, బయటా చిన్న చిన్న సమస్యలు వచ్చాయని వెనక్కి తగ్గవద్దు. ఇప్పుడు ప్రతి పథకం మహిళల పేరుతోనే ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు.

March 8, 2026 / 03:17 PM IST

‘బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలి’

SRCL: 14 నుంచి 15 ఏళ్ల వయసులోపు బాలికలకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపి లోమా వైరస్) వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. గర్భాశయ క్యాన్సర్ నివారించేందుకు హెచ్‌పీ‌వీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు.

March 8, 2026 / 03:17 PM IST

‘ఇళ్ల పన్నులను త్వరితగతిన వసూలు చేయండి’

VZM: నిర్ణీత గడువు లోపల ఇంటి పన్నులను వసూలు చేయాలని DDO హేమ సుందర్ సిబ్బందిని ఆదేశించారు. పన్ను వసూలు జరుగుతున్న తీరును ఆయన ఆదివారం చీపురుపల్లి పట్టణంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ.. సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఆయన వెంట పంచాయతీ సిబ్బంది నాసిక రాము తదితరులు ఉన్నారు.

March 8, 2026 / 03:15 PM IST

మహిళలపై లైంగిక దాడులను అరికట్టాలి: NFIW

BDK: ఇల్లందు నియోజకవర్గ గార్ల NFIW మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఇవాళ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సాంబ లక్ష్మి మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులు, సమానత్వం, గౌరవప్రదమైన జీవన హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటాలకు గుర్తుగా నిర్వహించబడుతోందని అన్నారు. అలాగే మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టాలని పిలుపునిచ్చారు.

March 8, 2026 / 03:15 PM IST

రేపు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

ELR: ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఆర్‌డీఎస్‌ఎస్ పనుల నిమిత్తం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వేణు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పనుల దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

March 8, 2026 / 03:15 PM IST

ఎమ్మిగనూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

KRNL: ఎమ్మిగనూరు ఎంపీడీవో కార్యాలయంలో MLA బివి.జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

March 8, 2026 / 03:14 PM IST

‘తప్పనిసరిగా లేబర్ కార్డు తీసుకోండి’ ‘

KDP: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరూ లేబర్ కార్డు తీసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను లబ్ది పొందాలని ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు వి.గంగా సురేష్ అన్నారు. ఆదివారం ఎర్రగుంట్ల ఏఐటీయూసీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భావన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వివరించారు.

March 8, 2026 / 03:14 PM IST

‘క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా’

GDWL: గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, DMHO సంధ్యా కిరణ్మయి తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా, జిల్లాలో 7,103 మంది 14 ఏళ్ల బాలికలను గుర్తించారు. 

March 8, 2026 / 03:14 PM IST

‘మహిళలకు అండగా TDP ప్రభుత్వం’

PPM: మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నది టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

March 8, 2026 / 03:13 PM IST

భారీ చోరీ.. 65 తులాల బంగారం అపహరణ

AP: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడలో భారీ చోరీ జరిగింది. బీఎన్ రోడ్డు పక్కనే ఉన్న సుజాత అనే మహిళ ఇంట్లో 65 తులాల బంగారం, కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. నగదుతో కలిపి మొత్తం రూ.1.5 కోట్లు చోరీకి గురై ఉంటుందని అంచనా. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

March 8, 2026 / 03:12 PM IST

నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు

NLG: చిట్యాల మండలం ఏపూరిలో ఆకస్మికంగా మృతి చెందిన ఎరసాని కృష్ణయ్య కుటుంబానికి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలెం కృష్ణయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ రెడ్డి తీవ్ర ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. మృతదేహానికి ఇవాళ పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుడి కుమారుడు ఎల్లయ్యను పరామర్శించారు. వీరితో పాటు లింగస్వామి, నరసింహ పాల్గొన్నారు.

March 8, 2026 / 03:12 PM IST