BDK: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంస్థ సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతిని కలిసి ఆదివారం వినతిపత్రం అందజేశారు. కొత్త కోల్ బ్లాకుల సాధనతో పాటు, ప్రతి కార్మికుడికి సొంత ఇంటి పథకం కింద రూ.30 లక్షల వడ్డీ లేని రుణం అందించాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు.
ADB: శాంతి భద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలకు ప్రజలు సహకరించాలని గాదిగూడ ఎస్సై రమ్య అన్నారు. ఆదివారం సర్పంచులతో సమావేశం నిర్వహించారు. గుట్కా, గంజాయి, మత్తు పదార్థాలకు ప్రజలు బానిస కావద్దన్నారు. ఎవరైన గంజాయి సాగు చేసినా, విక్రయించినా చట్టరీత్య చర్యలు ఉంటాయన్నారు. అత్యవసరాలకు డయల్ 100ను సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.
SDPT: సమాజంలో వృద్ధాశ్రమాల సంఖ్య తగ్గించేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోమటి చెరువు వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ప్రతి ఇంటి బాధ్యతను మోసే మహిళలు, తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బాధ్యతల నిర్వహణే మనలో పోరాట పటిమను పెంచుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
KMR: జుక్కల్ మండలం మందాబాద్ తండకు చెందిన దేవల్ల హనుమంతు(19) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. హనుమంతు శనివారం బీరు తాగుతూ ఫోటోను కుటుంబ సభ్యులకు షేర్ చేశాడు. తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై సోమేశ్వర్ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసు ఆదివారం కేసు నమోదు చేశారు.
SRD: అమీన్‌పూర్ సర్కిల్ 47లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డిప్యూటీ కమిషనర్ డి. ప్రదీప్ కుమార్ ఇవాళ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. అమీన్‌పూర్, బీరంగూడ, ఆర్‌సీ పురం, భారతి నగర్, బొల్లారం ప్రాంతాల్లో పార్కులు, GVPలను శుభ్రపరిచారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన “పరిష్కారం” కార్యక్రమంలో 15 దరఖాస్తులను స్వీకరించారు.
W.G: ఉండి మార్కెట్ యార్డ్‌లో నియోజకవర్గస్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. మహిళలను గౌరవించడం అందరి బాధ్యతని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. మహిళలు అందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు సాగాలన్నారు.
WNP: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి పట్టణంలోని 12వ వార్డులో మున్సిపల్ సిబ్బందిని స్థానిక కౌన్సిలర్ నక్క రాణి-రాజు యాదవ్ ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ సిబ్బంది చేసే సేవలు మరువలేనివని వాటిని కొనసాగించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సమాజంలో ఎంతో సముచిత స్థానాన్ని కల్పిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బందిని రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సైలు నరేశ్, లక్ష్మారెడ్డి, సిబ్బంది శాలువాలతో సన్మానించారు. మండలంలోని మహిళా సోదరి సోదరీ మణులందరికీ KNR రూరల్ పోలీస్ స్టేషన్ తరుఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
VSP: ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి.
AP: విశాఖలోని ప్రముఖ సెలబ్రేషన్స్ రెస్టారెంట్‌పై ఐటీశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ పేమెంట్లు, డిజిటల్ డేటాలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
NTR: మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం సంపూర్ణ అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలలో ఆమె పాల్గొన్నారు. మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
KDP: ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంమని మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ అన్నారు. ఆదివారం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని యర్రగుడిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి మరో రూ.50 లక్షల ఎంపీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులకు ఆయన సూచించారు.
NLR: దగదర్తి పోలీస్ స్టేషన్లో ఎం. టీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న గద్దె మోహన్, కానిస్టేబుళ్లు టీ.రమణ, మహమ్మద్ రఫీ ఆదివారం నెల్లూరులో ఎస్పీ అజిత వేజెండ్ల చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు. వీరు దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసులో క్రిమినల్ను పట్టుకున్నందుకు ఎస్పీ అభినందించారు. బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఎస్పీ అభినందనలు తెలిపారు.
E.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేవరపల్లి మండలం దుద్దుకూరులో మాజీ హోంమంత్రి తానేటి వనితను ఆదివారం ఘనంగా సత్కరించారు. దేవరపల్లి మండల YCP మహిళా అధ్యక్షురాలు కడలి హైమావతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడవాలని ఈ సందర్భంగా మాజీ హోంమంత్రి ఆకాంక్షించారు.
సత్యసాయి: చిలమత్తూరు మండలం సోమగుట్టలో ఆదివారం నిర్వహించిన శ్రీ మధుగిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో హిందూపురం ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేవస్థానాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.