• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాష్ట్రపతికి మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలి: బీజేపీ

TG: హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం దగ్గర ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిరసన చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ మండిపడ్డారు. రాష్ట్రపతికి మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

March 8, 2026 / 03:31 PM IST

మహిళల అభివృద్ధికి సీఎం కృషి

CTR: మహిళల అభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. పుంగనూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. మహిళల కోసం ఉచిత గ్యాస్, బస్సులో ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో భాగంగా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టారని అన్నారు.

March 8, 2026 / 03:31 PM IST

‘రేపు జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమం’

ATP: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రేపు PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 8, 2026 / 03:30 PM IST

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి: ఎమ్మెల్యే

కోనసీమ: మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. మల్కిపురం మండలంలోని విశ్వేశ్వరరాయపురం గ్రామంలో ఉన్న క్యాంపు కార్యాలయం వద్ద ఆయన ఆదివారం అధికారులు నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొని మహిళలకు ప్రభుత్వం మంజూరు చేసిన డ్వాక్రా రుణాల చెక్కును అందజేశారు. అదేవిధంగా మహిళా నాయకులను ఎమ్మెల్యే సత్కరించారు

March 8, 2026 / 03:30 PM IST

ప్రకాశం జిల్లా APTF అధ్యక్షులుగా శేఖర్ బాబు

ప్రకాశం: జిల్లా AP టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా శేఖర్ బాబు ఎన్నికయ్యారు. ఆదివారం ఒంగోలులో జరిగిన జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో సబ్ కమిటీ సభ్యులు శేఖర్ బాబును ఎన్నుకున్నారు. గతంలో ఈ స్థానంలో షేక్ నాయబ్ రసూల్ ఉండేవారు. షేక్ నాయబ్ రసూల్ ప్రస్తుతం మార్కాపురం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.

March 8, 2026 / 03:30 PM IST

మాచర్లలో సఖి వన్ స్టాప్ సెంటర్ ప్రారంభం

PLD: మాచర్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. అనంతరం చేనేత వస్త్రాల ప్రదర్శన స్టాళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సీమంతం కార్యక్రమంలో ఆయన పాల్గొని గర్భిణీ మహిళలకు దీవెనలు అందజేశారు.

March 8, 2026 / 03:30 PM IST

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం

TPT: విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐ దంపతులు త్రిపురనేని వెంకటరత్నం, మాధురి ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 50 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా వారి కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్‌లు కూడా అదే ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు చొప్పున విరాళంగా సమర్పించారు.

March 8, 2026 / 03:30 PM IST

నల్లగొండలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

NLG: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం TPUS నల్లగొండ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా కార్యదర్శి తులసి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా నల్లగొండ ఎంఈఓ కత్తుల అరుంధతి విచ్చేసి ప్రసంగించారు. ​మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సంఘటిత శక్తితో హక్కులను సాధించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

March 8, 2026 / 03:30 PM IST

వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మేల్యే

NGKL: అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నారని, విద్యార్థినులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

March 8, 2026 / 03:27 PM IST

పరిగిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశం

VKB: పరిగి మండలం రాపోల్లో కావలి పద్మమ్మ నూతన ఇందిరమ్మ గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచనల మేరకు రాపోలు గ్రామానికి 18 ఇందిరమ్మ ఇళ్లను మంజూరయినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.

March 8, 2026 / 03:27 PM IST

పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవ వేడుకలు

NLR: మర్రిపాడు పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఆదివారం మహిళ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అనే మహిళను స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై తన సిబ్బందితో కలిసి శాలువతో సత్కరించి స్వీట్లు పంచిపెట్టారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని అన్నారు.

March 8, 2026 / 03:26 PM IST

‘యువత, మహిళలను బీజేపీలో భాగస్వామ్యం చేయాలి’

ASR: యువత, మహిళలను భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యం చేసేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చెయ్యాలని బీజేవైఎం నాయకులు పాంగి మత్స్య కొండ బాబు పేర్కొన్నారు. ఆదివారం చింతపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన చింతపల్లి, గూడెం కొత్త వీధి మండలాల ప్రశిక్షణ కార్యక్రమంలో ఆయన వక్తగా పాల్గొని మాట్లాడారు.

March 8, 2026 / 03:25 PM IST

‘యువతకు ఉచిత శిక్షణను అందిస్తాం’

NRML: సైనిక నియామకాలకు యువతకు ఉచిత శిక్షణ అందిస్తానని మాజీ సైనిక ఉద్యోగి రవీందర్ తెలిపారు. దేశ రక్షణలో 24 సంవత్సరాలు సరిహద్దుల్లో సైనికునిగా సేవలందించి పదవీ విరమణ పొందిన ఆయనను ఆదివారం కుమ్మరి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

March 8, 2026 / 03:24 PM IST

మార్గసాహేశ్వరస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు

CTR: బైరెడ్డిపల్లి మండలంలోని నెల్లిపట్ల గ్రామంలోని శ్రీ మరగదాంబ సమేత మార్గసాహేశ్వరస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పూజ కార్యక్రమాలలో పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పాల్గొన్నారు. మరగదాంబ సమేత మార్గసాహేశ్వర స్వామి ఆశీస్సులతో పలమనేరు నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు ఆయన చెప్పారు.

March 8, 2026 / 03:22 PM IST

జిల్లా ఆస్పత్రిలో సూపర్‌వైజర్ దందా..?

BHPL: జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సూపర్‌వైజర్ రాజ్ చేతుల్లో బందీ అయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాల పేరిట రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాడని, డబ్బు ఇవ్వకపోతే పోస్టింగ్ ఇవ్వడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై జిల్లా కలెక్టర్ తక్షణమే సమగ్ర విచరణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

March 8, 2026 / 03:21 PM IST