NLR: మర్రిపాడు పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఆదివారం మహిళ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో స్వీపర్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అనే మహిళను స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై తన సిబ్బందితో కలిసి శాలువతో సత్కరించి స్వీట్లు పంచిపెట్టారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని అన్నారు.