సత్యసాయి: కదిరిలో వెలసిన ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు ఆదివారం రాత్రి స్వామివారు గజ గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మోత్సవాలు ఈనెల 13 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.