E.G: సమాజంలో అలజడులు సృష్టించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ డీ.నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఆదివారం రౌడీ షీటర్లు, గంజాయి ముఠాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిందితులు సత్ప్రవర్తనతో మెలగాలని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని ఆయన తెలిపారు.