ATP: గుత్తి కోట ఉత్సవాలను ఈనెల 14, 15 తేదీల్లో వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ ఆనంద్ నేతృత్వంలో ఉత్సవాల షెడ్యూలు ఖరారైంది. స్థానిక ఎమ్మెస్ ఫుట్బాల్ మైదానంలో సభలు నిర్వహించనుండగా, 15న పట్టణం నుంచి కోట వరకు హెరిటేజ్ వాక్ కొనసాగుతుంది. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు ఏర్పాటు చేశారు.