ADB: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. ఆదివారం బేల మండలంలోని సదల్ పూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి ఆయన మాట్లాడారు. నూతన చట్టంతో కూలీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.