SRCL: కరీంనగర్‌లోని ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన కరాటే గ్రేడింగ్ పరీక్షలో వేములవాడకు చెందిన గాజుల వివేక శ్రీ ప్రతిభ కనబర్చి బ్లాక్‌బెల్ట్ సాధించింది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న ఆమె చిన్న వయసులోనే ఈ ఘనత సాధించడం అభినందనీయమని పాఠశాల కరస్పాండెంట్ సన్నిధి వెంకట కృష్ణ తెలిపారు.