కోనసీమ: ఆత్రేయపురం మండలం పులిదిండి వేలిచేరు శివారులో కోడిపందాలు ఆడుతున్న వారిపై ఎస్సై రాము నేతృత్వంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 5,500 వేల నగదు, రెండు పుంజులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.