KDP: అంబులెన్స్‌లో మహిళ ప్రసవించిన ఘటన జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బి.మఠం మండలం పలుగురాళ్లపల్లికి చెందిన గర్భిణీ అపర్ణను పోరుమామిళ్ల నుంచి ప్రొద్దుటూరు ఆసుపత్రికి అంబులెన్స్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నట్లు అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహాలక్ష్మి తెలిపారు.