MHBD: తొర్రూర్ పట్టణానికి చెందిన RTC డ్రైవర్ షేక్ యాకూబ్ పాషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని డిపో నుంచి ఇంటికి వెళ్తుండగా స్థానిక రామకృష్ణ థియేటర్ సమీపంలో స్కూటీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ.. RTC డ్రైవర్ మృతి చెందారు.