• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహిళలే వారిని కంట్రోల్ చేయాలి: చంద్రబాబు

AP: స్మార్ట్ ఫోన్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రజలకు సూచించారు. ఫోన్ల వల్ల ఇళ్లలో మనుషుల మధ్య సంభాషణలు తగ్గి, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మితిమీరిన వాడకం మానసిక సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. భర్త, పిల్లలు ఫోన్లకు బానిస కాకుండా మహిళలే వారిని కంట్రోల్ చేయాలని ఆయన హితువు పలికారు.

March 8, 2026 / 03:59 PM IST

ఉమ్మడి జిల్లాలో భానుడి ప్రతాపం..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకముందే భానుడు భగభగమంటున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచే ఎండ ప్రతాపం తీవ్రంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు.

March 8, 2026 / 03:57 PM IST

T20 WC: ఫైనల్ పోరు.. బెట్టింగ్‌ల జోరు

T20 WC ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. దీంతో బెట్టింగ్ రాయుళ్లు యాక్టివ్ అయ్యారు. NZపై రూ. వెయ్యికి.. 2900, INDపై రూ. వెయ్యికి.. 400 ఇస్తామని వల వేస్తున్నారు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయింగ్ 11లో ఉంటాడా?.. ఉండడా అని కొందరు పందెం వేస్తున్నారు. మరోవైపు స్కోర్ 180 దాటుతుందా? ఏ బ్యాటర్ ఎంత స్కోర్ చేస్తాడో అని మరి కొందరు బెట్టింగ్ వేస్తున్నారు.

March 8, 2026 / 03:53 PM IST

ముగ్గురు కూతుళ్లను హత్యచేసిన తండ్రి రిమాండ్

KMR: ముగ్గురు కూతుళ్లను నిర్దాక్షిణ్యంగా చెరువులోకి తోసి హత్య చేసిన తండ్రిని రిమాండ్ చేసినట్లు KMR సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. సబ్ డివిజన్ కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. అప్పుల భారం 3 కూతుళ్లను పోషించలేకనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. నిందితుడిని కోర్టులో రిమాండ్ చేశామన్నారు.

March 8, 2026 / 03:50 PM IST

కడపలో ఘనంగా మహిళా దినోత్సవం

కడపలోని మేడా కన్వెన్షన్ సెంటర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళల చైతన్య సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి హాజరై మహిళలకు నిధుల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జెసీ, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

March 8, 2026 / 03:49 PM IST

మహిళా పారిశ్రామికవేత్తల ప్రతిభను అభినందించిన ఎమ్మెల్యే

కోనసీమ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా, మెప్మా, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తుల స్టాల్స్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రతిభను చూసి వారిని అభినందించారు.

March 8, 2026 / 03:48 PM IST

మార్చి 15న జిల్లాకు వైఎస్ షర్మిల

VZM: ఏపీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి మార్చి 15న విజయనగరం జిల్లాకు రానున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ తెలిపారు. ఉపాధి హామీ పరిరక్షణ పోరాటంలో భాగంగా మార్చి 15న బొబ్బిలి(మం) పారాది గ్రామం, జామి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొనాలని కోరారు.

March 8, 2026 / 03:48 PM IST

మానసిక ఉల్లాసానికి ‘హ్యాపీ సండే’: కమిషనర్

KRNL: ప్రజల మానసిక ఒత్తిడిని తగ్గించి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ప్రభుత్వం ‘హ్యాపీ సండే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం బిర్లా కాంపౌండ్‌లోని ‘ఖానా-ఖజానా’ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలు రోజువారీ పనుల ఒత్తిడిలో ఉంటారని, అలాంటి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం ఉల్లాసంగా గడపాలని ఆయన సూచించారు.

March 8, 2026 / 03:47 PM IST

‘వంటగ్యాస్ ధరలు తగ్గించాలి’

JN: చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని నిరసన చేపట్టారు. సీపీఎం మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. పెరిగిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, గ్యాస్ ధరల పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

March 8, 2026 / 03:46 PM IST

చంద్రగిరిలో రూ.520 కోట్ల చెక్కులను పంపిణీ

TPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రగిరిలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘ఎన్టీఆర్ విద్యాలక్ష్మి’, ‘ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి’ పథకాలను ప్రారంభించారు. అలాగే మహిళా సంఘాలకు మంజూరైన సుమారు రూ.520 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు.

March 8, 2026 / 03:45 PM IST

రాష్ట్రంలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం

TG: రాష్ట్రంలో డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క హాజరయ్యారు. ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ వేయనున్నారు. 14 ఏళ్లు నిండిన 4 లక్షల మంది అమ్మాయిలకు టీకా వేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని ఉచిత హెల్త్ స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు.

March 8, 2026 / 03:45 PM IST

ట్రాన్స్‌కో స్టోర్స్‌లో భారీ అగ్నిప్రమాదం

AP: రాజమహేంద్రవరం బొమ్మూరు ట్రాన్స్‌కో స్టోర్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటికే వినియోగించి తీసుకొచ్చిన స్క్రాప్ మీటర్లు ఉంచిన చోటు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న 6 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి.

March 8, 2026 / 03:42 PM IST

భద్రాచలానికి భక్తుడి పాదయాత్ర

NRPT: ఉట్కూరు మండల కేంద్రానికి చెందిన శ్రీరామ మాలధారి ఆదివారం భద్రాచలం క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఇరుముడి కట్టుకుని రామనామ స్మరణతో ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా 14వ వార్డు సభ్యురాలు సువర్ణ రవికుమా, భక్తులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

March 8, 2026 / 03:42 PM IST

పేదలకు అండగా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే

NZB: సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. చంద్రయాన్ పల్లికి చెందిన ముత్తవ్వ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శస్త్రచికిత్సకు రూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో ఆదివారం ఎమ్మెల్యే స్పందిస్తూ.. ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

March 8, 2026 / 03:42 PM IST

గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆగ్రహం..!

KRNL: ఆదోనిలో వంట గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేతలు ఆదివారం విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే రూ.60 పెంపు చేయడం ప్రజలపై భారం మోపినట్లేనని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దిలీప్ ధోక తెలిపారు. 21 రోజుల ముందే బుకింగ్ నిబంధన ప్రజలకు ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

March 8, 2026 / 03:41 PM IST