• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ దంపతులు

అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ట, రాజగోపుర కలశ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు పాల్గొన్నారు. నూతన ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన పసిడి కలశాల నీరాజనం, కలశ ప్రతిష్టా కార్యక్రమాల్లో వారు శాస్త్రోక్తంగా పాలుపంచుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

March 8, 2026 / 04:34 PM IST

‘నేడు వేడుక కాదు.. పోరాట దినం’

PDPL: అంతర్జాతీయ మహిళా దినోత్స నేడు వేడుక కాదు.. పోరాట దినమని పీవోడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి అన్నారు. అంతర్గాం మండలం పెద్దంపేటలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. మహిళలను విధాన నిర్ణయాల్లో భాగస్వాములను చేయాలని, రిజర్వేషన్లను గౌరవించాలని డిమాండ్ చేశారు.

March 8, 2026 / 04:33 PM IST

రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NLR: పొదలకూరు జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో సోమవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9వ విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

March 8, 2026 / 04:33 PM IST

కథలాపూర్ మండలంలో కంపించిన భూమి

JGL: కథలాపూర్ మండలవ్యాప్తంగా 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. పెద్ద శబ్దం వినిపించడంతో ప్రజలందరూ ఒక్కసారిగా బయటికి వచ్చి భయబ్రాంతులకు గురయ్యారు. ఆదివారం సుమారు 12:47 నిముషాల సమయంలో భూమి కంపించింది. దీంతో ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు భయందోళనకు గురయ్యారు. గతంలో ఇలాంటి శబ్దం ఎప్పుడు వినిపించలేదని ప్రజలు పేర్కొంటున్నారు.

March 8, 2026 / 04:33 PM IST

‘మహిళలు అన్ని రంగాల్లో స్థిరపడాలి’

KNR: గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో ఆదివారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా గ్రామ మహిళలను సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ శాలువాలతో సత్కరించారు. అనంతరం కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. స్త్రీని పూజించిన చోట దేవతలు పూజింపబడతారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో స్థిరపడలన్నారు. గ్రామ మహిళల అభివృద్ధి విషయంలో సహాయ పడతానని ఆయన హామీ ఇచ్చారు.

March 8, 2026 / 04:32 PM IST

ఉమెన్స్ డే.. శశివర్ణ అందరికీ స్ఫూర్తిదాయకంగా!

MBNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాలానగర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన 24 ఏళ్ల శశివర్ణ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇటీవల జరిగిన GP ఎన్నికల్లో సర్పంచ్‌గా విజయం సాధించిన ఆమె, జిల్లాలో అతి చిన్న వయసులో మహిళా సర్పంచ్‌గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం బీఈడీ చదువుతున్న శశివర్ణ, చదువుతో పాటు ప్రజాసేవలో ముందుకు సాగుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

March 8, 2026 / 04:31 PM IST

ఘనంగా నిదానంపాటి అమ్మవారి జాతర

PLD: దుర్గి మండలం పరిధిలోని అడిగొప్పల గ్రామ సమీపంలోని నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం ప్రారంభమైంది. ఉదయం నుండే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నైవేద్యాలు తయారుచేసి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

March 8, 2026 / 04:30 PM IST

ప్రాజెక్టులపై అధికారులకు మంత్రి హెచ్చరిక

TG: 2028 డిసెంబర్‌లోగా ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కాంట్రాక్టర్ల బిల్లులను వెంటనే విడుదల చేస్తామని వెల్లడించారు. భూసేకరణ, R&Rకు వేర్వేరుగా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులు పెండింగ్‌లో పెట్టొద్దని సూచించారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు.

March 8, 2026 / 04:30 PM IST

ఎమ్మెల్యే వీరేశంను కలిసిన ఎరుకల ఉద్యోగుల సంఘం

NLG: జిల్లా ఎరుకల ఉద్యోగుల సంఘం నాయకులు ఆదివారం నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల వెంకన్న, ప్రధాన కార్యదర్శి చర్లపల్లి వెంకటయ్య, కోశాధికారి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మొగిలి విజయ్ శేఖర్, గౌరవాధ్యక్షులు ఉండ్రాతి కృష్ణయ్య, సహా పలువురు ఎమ్మెల్యేను కలిసి సత్కరించారు. అనంతరం ఎరుకల సంఘం సంక్షేమంపై చర్చించారు.

March 8, 2026 / 04:29 PM IST

మార్కెట్ యార్డ్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం

పుంగనూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రూ.59 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధితో రైతులకు సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

March 8, 2026 / 04:28 PM IST

నేను గర్వంగా ఫీల్ అవుతున్నా: దువ్వాడ మాధురి

AP: తెలుగు రాష్ట్రాల్లో మహిళలందరికీ దువ్వాడ మాధురి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆరోగ్యం, ఆర్థిక స్వేచ్ఛతో పాటు మహిళలు మానసికంగా బలంగా ఉండాలి. తిరుమలలో జాన్వీ కపూర్ కేక్ కట్ చేస్తే వివాదం కాలేదు కానీ, నేను కట్ చేస్తే తప్పా? నా గురించి ఏదో ప్రచారం చేస్తూ కొంతమంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా’ అంటూ వ్యాఖ్యానించారు.

March 8, 2026 / 04:24 PM IST

సామూహిక వివాహాలకు హాజరైన ఎమ్మెల్యే

NZB: బాల్కొండ మండలం రంగనాథ స్వామి సాక్షిగా, పైలా నరసింహయ్య యాదవ్ ఆధ్వర్యంలో 24 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నూతన వధూవరులను ఆశీర్వదించారు. పేద కుటుంబాలకు బాసటగా నిలుస్తూ నరసింహయ్య చేస్తున్న సామాజిక సేవ అభినందనీయమని కొనియాడారు.

March 8, 2026 / 04:20 PM IST

సృష్టికి మూల స్తంభం స్త్రీ: ఎమ్మెల్యే

ELR: సృష్టికి మూల స్తంభం స్త్రీ అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆదివారం దెందులూరులో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన ‘బ్యాంకు లింకేజీ స్త్రీ నిధి-ఉన్నతి, pmajy’ పథకాల ద్వారా 13,594 మంది స్వయం సహాయక సంఘాల రూ.292 కోట్ల చెక్కు అందజేశారు.

March 8, 2026 / 04:20 PM IST

రేపు పెనుకొండలో పర్యటించనున్న మంత్రి

సత్యసాయి: పెనుకొండలో మంత్రి సవిత సోమవారం పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పెనుకొండలో అంబేడ్కర్ సర్కిల్ ఎదురుగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన బస్టాండ్‌ను మంత్రి ప్రారంభిస్తారు. 3:30 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

March 8, 2026 / 04:20 PM IST

‘రేపు కలెక్టరేట్‌లో యథావిధిగా PGRS కార్యక్రమం’

కోనసీమ: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా ఆర్డీవో, ఎంపీడీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలన్నారు.

March 8, 2026 / 04:20 PM IST