• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాలో పెరుగుతున్న ఎండలు

NGKL: జిల్లాలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలో అత్యధికంగా కోడేరు మండల కేంద్రంలో 35.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బిజినపల్లి, ఊర్కోండ, యంగంపల్లి 35.8°C, కల్వకుర్తి 35.7°C, తిమ్మాజీపేట 35.6°C, తెలకపల్లి 35.5°C, పెద్దకొత్తపల్లి 35.3°C, జటప్రోలు 35.1°C, కొల్లాపూర్ 34.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

March 11, 2026 / 10:39 AM IST

ఇల్లు దగ్ధం.. ఎమ్మెల్యే BLR తక్షణసాయం

NLG: మిర్యాలగూడ మండలం కొత్తపేటలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కొండూరు బిక్షం ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సహాయం కింద రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

March 11, 2026 / 10:39 AM IST

సెట్స్ మీదకు ‘దేవర 2’.. ఎప్పుడంటే?

జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’ సీక్వెల్‌పై నిర్మాత సుధాకర్ మిక్కిలినేని కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆలస్యమైన ఈ మూవీ మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలిపాడు. ‘దేవర 2’ కోసం నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుండగా.. తాజా ప్రకటనతో వారిలో ఉత్సాహం పెరిగింది.

March 11, 2026 / 10:39 AM IST

వాటిలో రక్తం భిన్న రంగుల్లో ఎందుకు?

సాధారణంగా రక్తం ఎరుపుగా ఉంటుందని మనకు తెలుసు. కానీ, కొన్ని జంతువులలో హిమోసైనిన్ వల్ల నీలం, బిలివర్డిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకుపచ్చ, హెమెరిథ్రిన్ అనే ప్రోటీన్ వల్ల ఊదా రంగులో రక్తం కనిపిస్తుంది. వాటి శరీరంలోని వేర్వేరు వర్ణద్రవ్యాలే ఈ రంగుల మార్పుకు ప్రధాన కారణం. అందుకే ఆక్టోపస్, గుర్రపుడెక్క పీతలు, కొన్ని రకాల పురుగుల రక్తం మనకంటే భిన్నంగా, రంగురంగుల్లో కనిపిస్తుంది.

March 11, 2026 / 10:38 AM IST

రాష్ట్రపతిని కలిసిన కడప ఎంపీ అవినాశ్

KDP: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో పార్లమెంటు సభ్యులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అల్పాహార విందు కార్యక్రమంలో ఎంపీ అవినాశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు తనూజ రాణి, వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాశ్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

March 11, 2026 / 10:36 AM IST

మంగంపేట బెరైటీస్‌పై కేంద్రానికి సర్కార్ లేఖ

AP: మంగంపేట బెరైటీస్ ఎగుమతులపై ప్రతిపాదిత ఆంక్షలు పక్కనబెట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాసింది. ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే APMDC ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. మైనింగ్ రంగానికి నష్టం కలగకుండా ఆంక్షల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో విజ్ఞప్తి చేసింది.

March 11, 2026 / 10:36 AM IST

సమర్థవంతంగా సేవలందించాలి: ఎమ్మెల్యే

BDK: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆయనను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో కూనంనేని సాంబశివరావు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి రాజ్యసభలో సమర్థంగా సేవలందించాలని ఆకాంక్షించారు.

March 11, 2026 / 10:32 AM IST

‘గ్రావెల్ క్వారీల అనుమతులు ఆపాలి’

TPT: సత్యవేడు నియోజకవర్గంలో అనుమతులు పొందిన గ్రావెల్ క్వారీల వద్ద తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలగురువం బాబు సుడిగాలి పర్యటన చేశారు. విచ్చలవిడిగా క్వారీలకు అనుమతులు ఇవ్వడం వల్ల గ్రామాల ప్రశాంతత దెబ్బతింటోందని, రహదారులు పాడవుతున్నాయని తెలిపారు. అనుమతులు ఆపకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్లి నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

March 11, 2026 / 10:30 AM IST

లోకేష్‌కు ఢిల్లీలో స్వాగతం పలికిన ఎంపీ బీకే

సత్యసాయి: ఢిల్లీ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి ఇతర నేతలతో కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు లోకేష్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఎంపీ పార్థసారధి మంత్రి వెంట ఉంటూ పలు అభివృద్ధి పనులపై చర్చించనున్నారు.

March 11, 2026 / 10:30 AM IST

ఇక అందరికీ ‘డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌’

TG: రాష్ట్రంలో ప్రతి వ్యక్తి పేరిట డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రూ.94 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలతో హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేయనున్నారు. వారికి హెల్త్ కార్డులు కూడా జారీ చేయనున్నారు.

March 11, 2026 / 10:30 AM IST

కారు ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

BPT: పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలోని నల్లవాగు వద్ద అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై ఇవాళ కారు అదుపుతప్పి వాగులో పడింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 11, 2026 / 10:28 AM IST

అయోమయంలో పంచాయతీ కార్యదర్శులు

జనగామ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పని అయోమమంగా మారింది. రాత్రికి రాత్రే 160 మంది పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్ పేరుతో ట్రాన్స్‌ఫార్ చేశారు. కనీసం వాళ్లకు ఆప్షన్‌లు పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో కొందరికి దూరం అయిందిని, మరి కొందరికి ఇబ్బంది అవుతుందని వాపోతున్నారు. దీంతో జిల్లాలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.

March 11, 2026 / 10:28 AM IST

ఉపాధి హామీ పనులను పరిశీలించిన MPDO

VZM: మెరకముడిదాం మండలం కొర్లాం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో భాస్కర్ రావు బుధవారం పరిశీలించారు. ఈరోజు సంబంధించిన వేతనదారులు హాజరును చూసారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పనులకు హాజరు కావాలని ఆయన సూచించారు. పని ప్రదేశంలో టెంట్స్ వేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఇంటికాడ చల్లార్చిన వ్యక్తిగత వాటర్ తీసుకొని రావాలని కోరారు.

March 11, 2026 / 10:28 AM IST

పలు కార్యాలయాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

MDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ ఐడీఓసీ (IDOC) లోని పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణను సమీక్షించి, పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

March 11, 2026 / 10:28 AM IST

సూర్య ‘కరుప్పు’ రూమర్లకు చెక్

సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కరుప్పు’ సినిమా విడుదలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. 2026 ఏప్రిల్ 10న సినిమా విడుదలవుతుందన్న ప్రచారాన్ని బాలాజీ ఖండించాడు. ఆ తేదీన సినిమా రావడం లేదు.. మరికొన్ని రోజుల్లో అధికారిక తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశాడు. దీంతో సూర్య అభిమానులు అసలు రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

March 11, 2026 / 10:28 AM IST