VSP: మురళీనగర్‌లోని ప్రశాంత్ పార్క్ అభివృద్ధి కోసం స్థానిక నాయకులు ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజును కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉన్న ప్రహరీ గోడను అభివృద్ధి చేయడం, స్టోర్‌రూమ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
SRCL: భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే రసాయన ఎరువులు వాడాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ హరికృష్ణ సూచించారు. హన్మాజీపేట రైతు వేదికలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఆయిల్ పామ్, ప్రకృతి వ్యవసాయం, కూరగాయల సాగుతో అధిక లాభాలు గడించవచ్చని హరికృష్ణ అన్నారు. AO వినీత రెడ్డి పాల్గొన్నారు.
AP: ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాణాసంచా ప్రమాదం, శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ ఘటనలు చాలా బాధించాయని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
PDPL: ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఇవాళ ఆయన పెద్దపల్లి ప్రజాప్రతినిధుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉపయోగపడే రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకం మొదలగు పనులు చేపట్టాలని సూచించారు.
NLG: తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్‌కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ షాక్ ఇచ్చింది. ఒక భూ వివాదంలో పక్షపాతంగా వ్యవహరించారంటూ బాధితుడు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా, దీనిపై నివేదిక ఇవ్వాలని గతంలోనే తహసీల్దార్‌ను ఆదేశించింది. అయితే కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నివేదిక సమర్పించకపోవడంతో ఆగ్రహించిన TGHRC, ఎమ్మార్వోకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
GDWL: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత నాణ్యమైన విద్య అందుతుంది అని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో గద్వాల ప్రభుత్వ ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాల నూతన ప్రవేశాల అవగాహన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SKLM: గురువారం వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రణస్థలం మండలం జిఆర్ పురం వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. అనంతరం రణస్థలం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సమక్షంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహించనున్నామన్నారు. వైసీపీ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
MBNR: జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా స్థాయి ప్రహరీ క్లబ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఈవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని అన్నారు. అనంతరం ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
MDK: రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ‘స్వయం పరిపాలన దినోత్సవం’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 5వ తరగతి విద్యార్థులు J. భానుప్రకాష్ (DEO), S. నరేష్ (MEO), కుమారస్వామి (కాంప్లెక్స్ HM), T. రాకేష్ (హెడ్ మాస్టర్)గా బాధ్యతలు స్వీకరించి అలరించారు. మిగతా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
SDPT: మట్టి పరీక్షలు ఆధారంగా పంటలకు సరిపడా ఎరువులు వేసుకోవచ్చని సిద్దిపేట ఏడీఏ పద్మ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా చిన్నకోడూరు మండలం అల్లీపూర్‌లో బుధవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతుల వ్యవసాయ క్షేత్రంలో మట్టి పరీక్ష నమూనాలు సేకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడటం వల్ల భూమి నిస్సారమవుతుందన్నారు.
TG: వెలుగుమట్లలో ప్రత్యేక లేఅవుట్ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఇళ్లు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. పేదలు నిర్భయంగా, ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. పట్టాలు పొందిన వారందరికీ ప్రభుత్వమే స్వయంగా ఇళ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 9 నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
సత్యసాయి: CM చంద్రబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు. జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. పేదల సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులందరికీ అందేలా తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.
VZM: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా.ఎస్. జీవన రాణి అధ్యక్షతన బుధవారం మాతృ, శిశు మరణాల జిల్లా ఉప కమిటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరిలో సంభవించిన మాతృ, శిశు మరణాల్లో ఎంపిక చేసిన 6 శిశు మరణాలపై జిల్లా ఉప కమిటీ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కోనసీమ: కాట్రేనికోన మండలం చెయ్యేరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామాలకు లైన్ల మరమ్మత్తులు కారణంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ డీఈ వెల్లడించారు. ఈ నేపధ్యంలో వినియోగదారులు సహకరించాలని కోరారు. మరమ్మత్తులు పూర్తయిన తర్వాతే సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.350 కోట్లతో 6 మండలాల డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌కు నిధులు మంజూరు అయ్యాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్నారు. లక్కిరెడ్డిపల్లి(మం) దిన్నేపాడు పంచాయతీలో పైప్‌లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అని తెలిపారు.