సత్యసాయి: హిందూపురం మండలంలోని వెంకటాద్రి లే అవుట్‌లో జరిగిన దోపిడీ కేసులో అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశంలో డీఎస్పీ కె.వి. మహేష్ అరెస్ట్ వివరాలు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన నిందితులు పటాన్ హైదర్ అలీ, ఇమ్రాన్ అలీ ఖాన్‌లను అరెస్టు చేసి 5 తులాలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని AITUC జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ పిలుపునిచ్చారు. బుధవారం మార్కాపురం సీపీఐ కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. రాజమండ్రిలో ఈ నెల 16, 17, 18వ తేదీలలో జరగనున్నాయన్నారు. రూ. 26వేలు అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NLR: అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్లో CM చంద్రబాబు నిర్వహించిన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదటి రోజు సమావేశంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చేసే ప్రణాళికల పట్ల సమీక్షించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశాలు వంటి సమాచారాన్ని చర్చించారు.
E.G: వైసీపీ ప్రభుత్వం దళితులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. బుధవారం కాకినాడలో నిర్వహించిన వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పదవులు ఎస్సీలకు కేటాయించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు.
ప్రకాశం: ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశించారు. బుధవారం మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లో జేసి శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత అమలు చేస్తున్నట్లు, కేంద్ర నిధులతో పాటు రాష్ట్రం ఇస్తుందన్నారు.
HNK: హసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామానికి చెందిన మంచాల కమల అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన రూ.5 లక్షల విలువైన ఎల్ఓసి కాపీని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రజలు ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలుకాకుండా, ప్రభుత్వ ఉచిత వైద్యం అందిస్తుందన్నారు.
KNR: సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా వీణవంక మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో పశువులకి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు బుధవారం డా. శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సీజనల్ వ్యాధులు పశువులకు వ్యాపిస్తే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మండల కేంద్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు సమకూర్చామని పేర్కొన్నారు.
RR: SDNR నియోజకవర్గంలోని పల్లె సీమల రూపురేఖలు మార్చడమే లక్ష్యమని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా లింగారెడ్డిగూడ గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నామన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు.
KMR: నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి ఎస్టీ మహిళా గురుకుల పాఠశాలను బుధవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిలో సరుకులను, విద్యార్థులకు ఆహారం అందించే తీరును ఆమె పరిశీలించారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారికి నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ సువర్ణ ఉన్నారు.
PLD: భర్త అనారోగ్యంతో మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను (55) పోలీసులు కాపాడారు. నరసరావుపేటకు చెందిన ఆమె రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లినట్లు సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ ప్రభాకర్, వెంటనే సిబ్బందిని పంపి ఆమెను సురక్షితంగా రక్షించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన సీఐ, పోలీసు సిబ్బందిని స్థానికులు అభినందించారు.
AP: సీఎం చంద్రబాబు కలెక్టర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొడక్ట్ పర్ఫెక్షన్ అంశంపై దిశా నిర్దేశం చేశారు. డ్వాక్రా ఉత్పత్తులు ప్రమోట్ చేసేలా చూడాలని ఆదేశించారు. స్వయం బ్రాండ్ పేరుతో ప్రమోట్ చేస్తున్నామని కలెక్టర్లు వివరించారు. డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రణాళికలు సిద్ధం చేయాలి. అమూల్ తరహాలో స్వయం బ్రాండ్ ద్వారా మార్కెటింగ్ చేయాలి అని సూచించారు.
KDP: ఖాజీపేట(మం) భూమయపల్లె సమీపంలో బుధవారం ఉదయం డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఓ లారీ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో సమీపంలో ఇతర వాహనాలు ఏవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
BDK: అశ్వారావుపేట స్థానిక ఏరియా ఆసుపత్రి సిబ్బంది అయిదు గంటల్లో అయిదు సుఖ ప్రసవాలు చేసి రికార్డ్ నెలకొల్పారు. వీరిలో ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తల్లి బిడ్డ అందరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి 12 నుంచి నేడు తెల్లవారు జామున 5 గంటలలోపు ఈ సాధారణ కాన్పులు జరిగాయని వైద్యులు తెలిపారు.
KMM: ఈనెల 14న ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షల కోసం అధికారులు జిల్లావ్యాప్తంగా 98 కేంద్రాలను ఎంపిక చేశారు. అత్యధికంగా ఖమ్మం నగరంలోనే కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా మండలాల్లో కేంద్రాలను ఎంపిక చేశారు. ఈ ఏడాది పరీక్షలకు 16,975 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
TG: రాష్ట్రంలో విద్యుత్ సంస్థ మూడో డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.TGRPDCL ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ, రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.