• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సాధు సమ్మేళనంలో పాల్గొన్న MLA

ADB: నేరడిగొండ మండల కేంద్రంలో సాధు సమ్మేళన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో బోథ్ MLA అనిల్ జాదవ్ పాల్గొని గ్రామస్తులు కలిసి ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. సమాజంలో సత్ప్రవర్తన తీసుకురావడానికి శ్రీ శివానంద స్వామి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ధర్మాన్ని రక్షించుటకై ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

March 11, 2026 / 06:08 PM IST

రేపటి నుంచి కస్తూర్బాలో ప్రవేశాలకు దరఖాస్తులు

ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీరామ సుశీల తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినిలు 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 7, 8, 9, 10వ తరగతుల్లో మిగిలిన సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

March 11, 2026 / 06:06 PM IST

భర్తపై భార్య దాడి

SKLM: కోటబొమ్మాళి మండలం మంచాలపేట గ్రామానికి చెందిన మంచాల వెంకటరమణపై భార్య మంచాల సునీత, తన సోదరుడితో కలిసి బుధవారం దాడి చేసింది. తనను ఒక గదిలో బంధించి భార్య బావమరిది గొల్లంగి జగదీష్‌లు గాయపరిచారని బాధితుడు వెంకటరమణ తెలిపారు. గాయపడిన తనను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.

March 11, 2026 / 06:05 PM IST

పోలీసుల సంక్షేమమే మా ప్రాధాన్యం: ఎస్పీ

GDWL: జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు బుధవారం ఆర్ముడ్ రిజర్వ్ (AR) పోలీసులతో ‘పోలీస్ దర్బార్’ నిర్వహించారు. సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తామని, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటిస్తూనే.. నిత్యం వ్యాయామం, యోగా ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సిబ్బందికి సూచించారు. 

March 11, 2026 / 06:05 PM IST

కడెం తహసీల్దార్‌గా లచ్చిరాం బాధ్యతల శ్వీకరణ

NRML: కడెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న లచ్చిరాంకు తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం కార్యాలయ సిబ్బంది ఆయనను ఘనంగా శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శారదా, సిబ్బంది ఉన్నారు.

March 11, 2026 / 06:05 PM IST

తాతకుంట్ల తండాలో ఉచిత వైద్య శిబిరం

NTR: విస్సన్నపేట మండలం తాతకుంట్ల తండాతో పాటు పలుతండాల్లో టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుడివాడ వారిచే ఉచిత వైద్య శిబిరం బుధవారం ఏర్పాటు చేశారు. ఎముకలు గ్యాస్ట్రో, సాధారణ వ్యాధులకు నిపుణులైన వైద్యులచే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.

March 11, 2026 / 06:05 PM IST

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీకాలు

NGKL: అవుసలికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ఇమ్యునైజేషన్ టీకాలు వేశారు. అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. కోరింత దగ్గు, ధనుర్వాతం వంటి వ్యాధులు రాకుండా టీకాలు వేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడావత్ మంగమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

March 11, 2026 / 06:03 PM IST

‘బాధితులకు రూ.22.47 కోట్లు రీఫండ్’

VSP: సైబర్ మోసాలకు గురైన 1,240 మంది బాధితులకు రూ.22.47 కోట్లను రీఫండ్ చేసినట్లు విశాఖ‌ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. చట్టపరమైన ప్రక్రియ ద్వారా హోల్డ్, ఫ్రీజ్ చేసిన మొత్తాలను బ్యాంకులు, సంబంధిత సంస్థలతో సమన్వయం చేసి బాధితులకు తిరిగి అందించినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సైబర్ మోసాల బాధితులకు నష్టపరిహారం అందించిన ఘ‌న‌త మాదేన‌న్నారు.

March 11, 2026 / 06:03 PM IST

టీమిండియాకు ఐసీసీ భారీ ప్రైజ్ మనీ

టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన భారత జట్టు భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు రూ. 24.25 కోట్లు లభించినట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇక రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు రూ. 13.08 కోట్లు అందగా, సెమీఫైనలిస్టులైన దక్షిణాఫ్రికాకు రూ. 9.24 కోట్లు, ఇంగ్లండ్‌కు రూ. 8.96 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.

March 11, 2026 / 06:02 PM IST

‘నాటు తుపాకులు కలిగి ఉండడం నేరం’

VZM: నాటు తుపాకులు కలిగి ఉండడం, లైసెన్సు లేకుండా వినియోగించడం చట్టరీత్యా నేరమని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ ఆయుధాలు ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని, ఎవరి వద్దైనా నాటు తుపాకులు ఉంటే స్వచ్ఛందంగా సమీప పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని సూచించారు.

March 11, 2026 / 06:02 PM IST

నాగన్నతహళ్లి దేవర కార్యక్రమాల్లో ప్రత్యేక పూజలు

KRNL: ఆదోని(మం) నాగన్నతహళ్లిలో ఇవాళ నిర్వహించిన పెద్దమ్మ అవ్వ దేవర కార్యక్రమాల్లో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరయ్యారు. అనంతరం ఆమె దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

March 11, 2026 / 06:01 PM IST

జగన్మోహిని కేశవ & గోపాల స్వామి హుండీ ఆదాయం రూ. 13.98లక్షలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం, ర్యాలి గ్రామంలో వేంచేసియున్న శ్రీ జగన్మోహిని కేశవ & గోపాల స్వామి వారి దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 5 నెలల 3 రోజులకు గాను ప్రధాన హుండీల ద్వారా రూ. 9,52,522, అన్నదాన హుండీల ద్వారా రూ.4,45,990 మొత్తంగా రూ.13,98,512 ఆదాయం వచ్చిందని ఈవో నరేంద్ర కుమార్ తెలిపారు.

March 11, 2026 / 06:00 PM IST

బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన కదిరి ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో జరిగిన ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ బుధవారం భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. కాలు పూర్తిగా దెబ్బతిన్న వ్యక్తికి రూ.5 లక్షలు, మిగిలిన ఐదుగురికి రూ.లక్ష చొప్పున సాయం అందజేస్తామని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి ఆలయంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

March 11, 2026 / 06:00 PM IST

గుత్తి కోట ఉత్సవాలపై అధికారులతో సమావేశం

ATP: గుత్తి మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో గుత్తి కోట ఉత్సవాలపై మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెప్మా పీడీ విశ్వ జ్యోతి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 14, 15 తేదీల్లో జరిగే కోట ఉత్సవాలలో మహిళా సంఘాల సభ్యులను హాజరయ్యేలా ఆర్పీలకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కోట ఉత్సవాలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

March 11, 2026 / 06:00 PM IST

IPL 2026 షెడ్యూల్ ఇదేనా..!

IPL-2026 సీజన్ తొలి దశ షెడ్యూల్ విడుదలైనట్లు ప్రచారం సాగుతోంది. ఈ మెగాటోర్నీ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ RCBతో SRH తలపడనుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ తన తదుపరి మ్యాచ్‌లను ఏప్రిల్ 2న కోల్‌కతా వేదికగా KKRతో, 4న సొంతగడ్డ(HYD)పై LSGతో ఆడనుంది.

March 11, 2026 / 05:59 PM IST