VSP: సైబర్ మోసాలకు గురైన 1,240 మంది బాధితులకు రూ.22.47 కోట్లను రీఫండ్ చేసినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. చట్టపరమైన ప్రక్రియ ద్వారా హోల్డ్, ఫ్రీజ్ చేసిన మొత్తాలను బ్యాంకులు, సంబంధిత సంస్థలతో సమన్వయం చేసి బాధితులకు తిరిగి అందించినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సైబర్ మోసాల బాధితులకు నష్టపరిహారం అందించిన ఘనత మాదేనన్నారు.