• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

SDPT: కోహెడ మండలం శనిగరంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతపై అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని సిబ్బందికి హెచ్చరించారు. అనంతరం తంగళ్లపల్లి కస్తూర్బా పాఠశాలను కూడా తనిఖీ చేశారు.

March 11, 2026 / 04:29 PM IST

గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

TPT: రాపూరులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి చదువు, వసతి, ఆహారంపై వివరాలు తెలుసుకున్నారు. వంటశాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే హాస్టల్, తరగతి గదులు, తాగునీరు వంటి సదుపాయాలను పరిశీలించారు.

March 11, 2026 / 04:28 PM IST

‘ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించండి’

ELR: ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించి, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని MLC గోపిమూర్తి అన్నారు. బుధవారం నారాయణపురంలో యూటీఎఫ్ మండల సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం అనే గోడపత్రికలను ఆవిష్కరించారు.

March 11, 2026 / 04:27 PM IST

బైక్‌ను ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి

JN: చిల్పూర్ మండలం కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై బుధవారం లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండ వైపు బైక్‌పై వెళ్తున్న దంపతులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గుగులోతు కమలమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త గుగులోతు దాసుకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన దాసును 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

March 11, 2026 / 04:27 PM IST

శివరాజ్ కుమార్ మూవీ నుంచి అప్‌డేట్

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు హేమంత్ రావు తెరకెక్కిస్తున్న మూవీ ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. ఈ సినిమాలో ‘అరువి’ ఫేమ్ నటి అదితి బాలన్ భాగమైనట్లు మేకర్స్ వెల్లడించారు. ఇందులో ఆమె ‘కావేరి’ అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రంలో డాలీ ధనుంజయ, ప్రియాంక మోహన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

March 11, 2026 / 04:27 PM IST

విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే

BDK: మణుగూరు గుట్ట మల్లారం ప్రాంతంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఒలింపియాడ్ INTSO పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఒలింపియాడ్ సెకండ్ లెవెల్ జిల్లా గ్రాండ్ ప్రైజ్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి డి. ఉజ్వల్ ధీరన్ ల్యాప్‌టాప్‌ను గెలుచుకున్నారు.

March 11, 2026 / 04:25 PM IST

సంజయ్ దాస్ అడుగు ఎటువైపు..?

NLG: చిట్యాలకు చెందిన తెలంగాణ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ తన రాజకీయ భవిష్యత్తుపై ఉగాది తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విద్యార్థి నేతగా, బీఆర్ఎస్, తెలంగాణ జాగృతిలలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయనకు కేటీఆర్, కవితలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన ఎటువైపు వెళ్తారు? అనే చర్చ జరుగుతోంది.

March 11, 2026 / 04:25 PM IST

కర్నూలు జిల్లా రైతులకు తీపి కబురు

KRNL: అన్నదాత సుఖీభవ—పీఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సహాయం ఈ నెల 13న విడుదల కానుందని జేడీఏ వరలక్ష్మి తెలిపారు. అర్హత కలిగిన రైతులకు రూ.6,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,72,757 మంది లబ్ధిదారులకు రూ.154.94 కోట్లు అందుతాయని వ్యవసాయ అధికారి వివరించారు.

March 11, 2026 / 04:24 PM IST

కనిగిరిలో రేపు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

ప్రకాశం: కనిగిరిలో గురువారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ బుధవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు వైసీపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్,10 గంటలకు చెక్పోస్ట్ వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం జరుగుతుందన్నారు. కావున నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

March 11, 2026 / 04:24 PM IST

వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చిన్న చింతకుంట పీహెచ్సీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ వైద్యులతో నిర్వహిస్తున్న శిబిరాన్ని పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాలను సందర్శించి, ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

March 11, 2026 / 04:24 PM IST

తిరువెంగళాపురంలో వివాహిత అనుమానాస్పద మృతి

KDP: పోరుమామిళ్ల(మం) తిరువెంగళాపురంలో సుజాత అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త గురుశేఖర్‌తో పాటు అత్తమామలు కలిసి హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడు రాజమండ్రిలో ఓ కాంట్రాక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

March 11, 2026 / 04:23 PM IST

కొరిశపాడు హౌసింగ్ ఇంఛార్జ్ ఏఈగా కిషోర్

BPT: కొరిశపాడు మండల హౌసింగ్ ఇంఛార్జ్ ఏఈగా కిషోర్ బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా DE దుర్గా రమేష్ చేతుల మీదగా ఆయన ఆర్డర్ కాపీని అందుకున్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ సిబ్బంది అభినందనలు తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని ఏఈ కిషోర్ మీడియాకు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తానన్నారు.

March 11, 2026 / 04:23 PM IST

రాజ్యసభకు ఎన్నికైన నరేందర్ రెడ్డిని అభినందించిన భట్టి

KMM: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ వేం నరేందర్ రెడ్డికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నరేందర్ రెడ్డి పెద్దల సభలో అడుగుపెట్టడం సంతోషదాయకమని, ఆయన పదవీ కాలంలో తెలంగాణ ప్రయోజనాల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తారని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.

March 11, 2026 / 04:21 PM IST

మంత్రి సీతక్కను కలిసిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు..

MLG: మంత్రి సీతక్కను మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కలిశారు. అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే మహిళా కార్యకర్తలకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షురాలికి మంత్రి సీతక్క సూచించారు.

March 11, 2026 / 04:21 PM IST

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలిస్తాం: పొన్నం

TG: కరీంనగర్ డంపింగ్ యార్డు శాశ్వతంగా తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలోని డంపింగ్ యార్డు ద్వారా ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా వెళ్లి ఆయన పరిశీలించారు. ఈ డంపింగ్ యార్డ్ వరంగల్ కరీంనగర్ మధ్యలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండు ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

March 11, 2026 / 04:18 PM IST