SRD: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి బసవేశ్వర విగ్రహం వరకు బైపాస్ రోడ్డు పనులు నాణ్యతగా చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. రోడ్డు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. రోడ్డు పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ షఫీ అహ్మద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జి పాల్గొన్నారు.
MHBD: చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామ సర్పంచ్‌గా అయూబ్ పాషా ఇటీవల ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఆయనను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో సన్మానించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపి గత BRS ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. మాజీ MLA రెడ్యానాయక్, తదితరులున్నారు.
WNP: కొత్తకోట మండలం వడ్డెవాట తండాకు చెందిన పాత్లావత్ ఠాగూర్ నాయక్‌కు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి బుధవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, సర్పంచ్ రాంలాల్ నాయక్ పాల్గొన్నారు.
కృష్ణా: గుడివాడ మార్కెట్ సెంటర్‌లోని ఘంటసాల నాగభూషణ్ అన్నదాన సత్రం ఆధ్వర్యంలో 50 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున రూ. లక్ష స్కాలర్షిప్ నగదును ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ప్రాముఖ్యత గాంచిన గుడులకే కాకుండా, సేవా తత్పరులకు నిలయంగా గుడివాడ నిలిచిందని పేర్కొన్నారు.
WGL: రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నూతన అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ బుధవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని వారు సూచించారు. స్వర్ణ మాట్లాడుతూ.. మహిళా క్షేత్రంలో పార్టీకి బలం చేకూర్చడం తన ప్రధాన లక్ష్యం అని అన్నారు.
MDK: మెదక్ పార్లమెంట్ పరిధిలోని పలు అభివృద్ధి పనుల కోసం ఎంపీ రఘునందన్ రావు రూ.2.4 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులు కేటాయించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డమ్ మల్లేష్ గౌడ్ తెలిపారు. బుధవారం నర్సాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అంగన్వాడీలు, మహిళా భవనాలు, పాఠశాల ప్రహరీ గోడలు, బోర్ల ఏర్పాటు కోసం ఈ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
SRPT: స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) నాయకులు మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున్‌లను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పాలూరి అంజయ్య, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
TPT: తిరుపతికి చెందిన సంగరాజు అశ్విని ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ సౌత్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. ఆమె విద్యార్హతలు, అనుభవాన్ని గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా అశ్విని సంతోషం వ్యక్తం చేయగా పలువురు అభినందనలు తెలిపారు.
SKLM: పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పబ్లిక్ పరీక్షల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి Ch. అప్పల నారాయణ తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు ఉచితంగా చేరుకోవచ్చన్నారు.
MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కార్మిక సంఘాల JAC నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ కార్మికులు మందుల కోసం వెళితే బీజోన్ ఆసుపత్రికి రిఫర్ చేయడం అనివార్యం అయిపోయిందన్నారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన వైద్యం అందడం లేదన్నారు.
E.G: తాళ్లపూడి మండలంలో బోట్స్ మెన్ సొసైటీ ఇసుక ర్యాంపులను తహశీల్దార్ లక్ష్మీ లావణ్య బుధవారం తనిఖీ చేశారు. వర్క్ ఆర్డర్లను ఆమె పరిశీలించారు. ఇసుక వాహనాలకు ఖచ్చితంగా టార్పాలిన్ కట్టాలని, బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. రోడ్లపై పడే ఇసుకను ప్రతిరోజు శుభ్రం చేయాలని సూచిస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
BPT: YCP పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం అద్దంకిలో ఘనంగా నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అశోక్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి, వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
SRCL: మహిళ సాధికారిత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్నారు. ప్రజాపాలన-ప్రగతి పాలనలో భాగంగా బోయినపల్లి మండలంలో శ్రీ ధరిత్రి, శ్రీ లక్ష్మీ తులసి గ్రామైక్య సంఘాల భావన నిర్మాణాలకు బుధవారం ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తరపున తనవంతు కృషి చేస్తానన్నారు.
GDWL: జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్ బాషా షేక్‌ను ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడ్డప్ప, కౌన్సిలర్లు పాల్గొన్నారు.